కాలేజీకి వెళుతున్న టెక్ విద్యార్థిని తరుముకొచ్చిన మృత్యువు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలేజీకి వెళుతున్న టెక్ విద్యార్థిని తరుముకొచ్చిన మృత్యువు

మృత్యువు ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు మరో ఉదాహరణే ఓ బీటెక్ విద్యార్థిని బలితీసుకున్న ఈ ఘటన. నేటి ఉదయం తన బైకుపై కాలేజీకి వెళుతున్న రాజేష్ అనే విద్యార్థిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం మంగుంట సమీపంలో జరిగింది. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News