కోతులకు ఆహారం పెడితే మూడేళ్ల జైలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోతులకు ఆహారం పెడితే మూడేళ్ల జైలు!

వానరాలను సాక్షాత్తు హనుమంతుని ప్రతిరూపాలుగా భావిస్తూ, అవి కనిపించినప్పుడు ఏదో ఒక పండును భక్తితో సమర్పించుకుంటామన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లోని చెట్లపై ఉండే కోతులు కనిపిస్తే, తప్పనిసరిగా ఏదో ఒకటి పెడుతుంటాం. అదే ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టిందిప్పుడు. వివిధ గుళ్లలో తిష్టవేసుకు కూర్చున్న కోతులు మరెక్కడికీ కదలకుండా భక్తులపై దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతుల బెడదపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాలయాల్లోని కోతులకు ఎటువంటి ఆహార పదార్థాలు, పండ్లు పెట్టరాదని, దీన్ని అతిక్రమిస్తే, మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు చట్టాలను సవరించింది. కోతులు అడవుల నుంచి బయటకు రావడానికి భక్తులు చేస్తున్న పనులే కారణమని అభిప్రాయపడుతూ, వాటిని తిరిగి అడవుల్లోకి పంపాలంటే, స్థానికంగా ఆహారం అందకుండా చేయాల్సి వుందని ఉత్తరాఖండ్ అటవీ శాఖ చీఫ్ వార్డెన్ డీవీఎస్ ఖాతీ తెలిపారు. కోతులను పట్టి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వదలాలన్న ఆలోచన వుందని, దీనికి కేంద్ర అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు.

More Telugu News