అత్యాచారానికి సహకరించలేదని మహిళకు నిప్పుపెట్టిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యాచారానికి సహకరించలేదని మహిళకు నిప్పుపెట్టిన పోలీసులు

అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అత్యాచారానికి సహకరించలేదని ఓ మహిళకు నిప్పుపెట్టిన ఘటన బారాబంకి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...యూపీ పోలీసు శాఖలో పని చేస్తున్న యాదవ్, అఖిలేష్ లు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించారు. వారి ప్రయత్నాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన ఆ కామాంధులు, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News