ఫోన్ ట్యాపింగ్ అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్ ట్యాపింగ్ అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది: పవన్ కల్యాణ్

ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన అంశమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తీర్చాల్సిన నేతలు, ప్రత్యర్థి పార్టీలను ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పుడు దారుల్లో నడుస్తున్నారని అభిప్రాయపడ్డారు. 'మీలో మీరే ఇలా కొట్టుకుని, తిట్టుకుంటుంటే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తార'ని ఆయన నిలదీశారు. మన రాష్ట్రంలో ఉన్నారు కదా? అని నేతలందరి ఫోన్లు ఇలా ట్యాప్ చేసుకుంటూ పోతే... జరిగేది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కక్షతో ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటూ పోతే, ప్రభుత్వాలు కొట్టుకుంటుంటే అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధం అంటే ఏముందిలే, ఏదో ఆషామాషీ వ్యవహారం అనుకుంటున్నారని, దానివల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్యుద్ధానికి ఉదాహరణ ఈ మధ్యే చోటుచేసుకున్న శ్రీశైలం ప్రాజెక్టు జల వివాదమని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో రెండు రాష్ట్రాల పోలీసులు దాడులకు దిగి, తలలు పగలుకొట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీల పేరిట ప్రభుత్వాలు కొట్టుకుంటే సమస్యలు పరిష్కరించేది ఎవరు? అని ఆయన నిలదీశారు.

More Telugu News