Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రణబ్ వెంట కుమారుడు అభిజిత్...పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట వచ్చిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఆలయానికి వచ్చారు. యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ తో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇటీవలే తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రణబ్ కుమారుడు అభిజిత్ అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక యాదగిరిగుట్టకు ఆయన తన తండ్రితో పాటే వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

More Telugu News