యాదగిరిగుట్ట చేరుకున్న టీ సీఎం కేసీఆర్... మరికాసేపట్లో రాష్ట్రపతి రాక
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట చేరుకున్నారు. కరీంనగర్ నుంచి నేటి ఉదయం బయలుదేరిన కేసీఆర్, నేరుగా గుట్టకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి రాకముందే గుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రణబ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. దక్షిణాది విడిది కోసం హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతి నేడు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుట్ట పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.