ఓటుకు నోటు కేసులో 'జిమ్మీ' అనే వ్యక్తికి నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఇంతవరకు వినని ఓ కొత్త వ్యక్తి పేరు బయటికొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే సండ్రతో పాటు జిమ్మీ అనే వ్యక్తికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఎల్లుండి సాయంత్రంలోగా విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సెబాస్టియన్ ను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు తీసుకొచ్చి, పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ అట. ఈ విషయాన్ని స్టీఫెన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసులో జిమ్మి పాత్ర ఏంటి? అసలు ఆయన ఎవరు? అతనికి రాజకీయాలతో సంబంధాలేమిటి? అతనికి సెబాస్టియన్ ఎలా తెలుసు? అన్న విషయాలను ఏసీబీ విచారించనుంది.