చంద్రబాబుకు జగన్ అల్టిమేటం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు జగన్ అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ అల్టిమేటం జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో ఆయన మాట్లాడుతూ, పొగాకు మద్దతు ధర 150 రూపాయలకు తగ్గకుండా పెంచాలని అన్నారు. పొగాకును రైతుల నుంచి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో పొగాకును 120 రోజుల పాటు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దానిని 80 రోజులకు కుదించారని ఆయన ఆరోపించారు. చెరకుకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన విమర్శించారు. అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆయన ఆరోపించారు.

More Telugu News