సీఎస్ కు సమ్మె నోటీసు ఇచ్చిన టి.రెవెన్యూ జేఏసీ
డిమాండ్లు నెరవేర్చాలంటూ అల్టిమేటం ఇచ్చిన తెలంగాణ రెవెన్యూ జేఏసీ ఈరోజు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మకు ఈ విషయంపై నోటీసు ఇచ్చింది. ఈ నెల 6 నుంచి వర్క్ టు రూల్ ప్రారంభించనున్నట్టు రెవెన్యూ జేఏసీ తెలిపింది. అప్పటికీ స్పందించకపోతే 13న సీసీఎల్ఏ ను ముట్టడించబోతున్నట్టు ప్రకటించింది. ఇవాళ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా, తమకు తక్షణమే ప్రమోషన్లు, వాహన సదుపాయం కల్పించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.