సివిల్స్ ఫలితాల విడుదల... టాప్ 5లో మొదటి నలుగురూ అమ్మాయిలే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సివిల్స్ ఫలితాల విడుదల... టాప్ 5లో మొదటి నలుగురూ అమ్మాయిలే!

2014 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లోనూ అమ్మాయిలు సత్తాచాటారు. మొదటి ఐదు ర్యాంకుల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇరా సింగాల్ కు మొదటి ర్యాంకు లభించింది. రేణూ రాజ్ కు రెండో ర్యాంకు, నిధి గుప్తాకు మూడవ ర్యాంకు, వందనారావుకు నాలుగో ర్యాంకు లభించగా, సుహర్ష భగత్ ఐదవ ర్యాంకును పొంది పురుష అభ్యర్థుల్లో తొలి స్థానంలో నిలిచాడు. పరీక్షా ఫలితాలను యూపీఎస్ సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఈ మధ్యాహ్నం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎం.సాకేత్ రాజాకు 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డికి 21వ ర్యాంకు, సుంకర రాజగోపాల్ కు 49వ ర్యాంకు, క్రాంతికుమార్ కు 50వ ర్యాంకు, ఎంవీఆర్ తేజకు 66వ ర్యాంకు, వేదితా రెడ్డికి 71వ ర్యాంకు, లక్ష్మీ భవ్యకు 88వ ర్యాంకు లభించాయి. ఉత్తీర్ణులైన వారిలో నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీస్ సెక్టార్ ఉద్యోగాల్లోకి 1,236 మందిని ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టుల్లో 590 జనరల్, 354 ఓబీసీ, 194 ఎస్సీ, 98 ఎస్టీ పోస్టులున్నాయి.

More Telugu News