విమానంలోంచి బయటపడేందుకు పోటీ పడ్డ ప్రయాణికులు...పది మందికి గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలోంచి బయటపడేందుకు పోటీ పడ్డ ప్రయాణికులు...పది మందికి గాయాలు

విమానంలోంచి కిందికి దిగేందుకు పోటీ పడే క్రమంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డ ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా నుంచి ధాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్తున్న చైనీస్ ఎయిర్ వేస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదం పసిగట్టిన పైలట్ విమానాన్ని సాన్యా నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ముంచుకొస్తుండడంతో విమానంలోంచి బయటపడేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 132 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

More Telugu News