తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇన్ చార్జ్ ల నియామకం... జాతీయ మహిళా మోర్చా ఇన్ చార్జ్ గా పురందేశ్వరి
బీజేపీ అధినాయకత్వం రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జ్ లను నియమించింది. ఏపీ ఇన్ చార్జ్ గా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ను, తెలంగాణ ఇన్ చార్జ్ గా కృష్ణదాస్ ను నియమించింది. ఇక, జాతీయ మహిళా మోర్చా ఇన్ చార్జ్ గా పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. ఆమెను కర్ణాటక సహ ఇన్ చార్జ్ గానూ నియమించారు. ఇక, మురళీధర్ రావును బీజేవైఎం ఇన్ చార్జ్ గానూ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్ చార్జ్ గానూ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.