భారత్ లో చొరబడేందుకు 225 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల పన్నాగం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ లో చొరబడేందుకు 225 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల పన్నాగం!

ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచంపై విరుచుకుపడుతున్న తీవ్రవాదులు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో 225 మంది తీవ్రవాదులు 36 పడవల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పిర్ పంజాల్ కు చేరుకున్నారని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అక్కడ భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, అక్కడి నుంచి భారత్ లో చొరబడి, ఆర్మీ, ప్రజలు లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించినట్టు చెప్పారు. దాంతో సైన్యాన్ని అప్రమత్తం చేసినట్టు ఆర్మీ అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా, గత నెల రోజులుగా కాశ్మీర్ లో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు. కాశ్మీర్ లో వేర్పాటు వాది ఖాసిం నిజార్ మృతి చెందాడు. ఈ సందర్భంగా కాశ్మీర్ లో ఓ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొంత మంది యువకులు ముఖాలకు మాస్క్ లు ధరించి, ఐసిస్ జెండాలు ప్రదర్శించిన ఘటనను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ ఉదయం నలుగురు తీవ్రవాదులను జవాన్లు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News