Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం: టీటీడీ ఈవో

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. పుష్కరాలకు రెండు రోజుల ముందే ఆలయ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 9.30 నిమిషాలకు ఆలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల తరహాలోనే రోజూ పూజలు నిర్వహిస్తామని, శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని ఈవో వివరించారు. అంతేగాక తిరుమల ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

More Telugu News