Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టిన నెలను బట్టే పిల్లలకు రోగాలు

సాధారణంగా వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు పుట్టుకతో సంక్రమిస్తాయని తెలుసు. పుట్టిన నెలను బట్టి కూడా వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు 28 ఏళ్ల పాటు, కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోదనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పుట్టిన నెల ఆధారంగా సుమారు 1700కు పైగా అనారోగ్య సమస్యలు పసి పిల్లలను చుట్టుముట్టే ప్రమాదం ఉందని, వాటిల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టినట్టైతే వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఉందని వారు వెల్లడించారు. పిల్లల ఆరోగ్య సమస్యల నిర్థారణ సమయంలో ఈ పరిశోధనల్లోని విషయాలు వైద్యులకు ఉపయోగపడతాయని భావిస్తున్నామని వారు చెప్పారు. పుట్టిన నెలను బట్టి ఇవే వ్యాధులు వస్తాయని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని వారు వెల్లడించారు.

More Telugu News