రాష్ట్రపతి, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతి, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారు?

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ నిన్న సాయంత్రం విందు ఇచ్చారు. ఈ విందుకు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా, ఒక్కో ముఖ్యమంత్రి అరగంట సేపు రాష్ట్రపతితో చర్చించేలా ఏర్పాటు చేశారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందుకు హాజరు కాకపోవడంతో... ఆయనకు కేటాయించిన అరగంట సమయంలో కూడా రాష్ట్రపతితో చంద్రబాబే గడిపారు. ఈ సందర్భంగా, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సమస్యలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ప్రణబ్ దాదా మాట్లాడుతూ, "మీరు ఎంతో అనుభవజ్ఞులు... ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అనుభవం మీకుంది. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. మీరు సర్దుకుపోండి" అంటూ సూచించారు. దీనికి సమాధానంగా... ఇరువురు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం చర్చిస్తే ఫలితం ఉంటుందని చంద్రబాబు అన్నారు. దీంతో, ఇది చాలా మంచి సలహా అంటూ రాష్ట్రపతి అన్నట్టు సమాచారం. దీనికితోడు... రాష్ట్ర విభజన ఎన్నో సమస్యలతో కూడుకొని ఉంటుందన్న విషయం తనకు తెలుసని... పూర్తి స్థాయి కసరత్తు జరగకుండానే విభజన చట్టాన్ని రూపొందించినట్టు రాష్ట్రపతి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

More Telugu News