Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోబోల సమక్షంలో రోబోల పెళ్లి!

'కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి...చిగురాకుల తోరణాలు...చిరుగాలే సన్నాయి' అన్నారో సినీకవి. రోబోల పెళ్లికి రెండు కంపెనీల్లో సందడి, రోబోలే పురోహితులు, రోబోలే కచేరీ చేశాయి. జపాన్ లో రోబోల వివాహం జరిగింది. 'మయవా డేంకీ' కంపెనీ రూపొందించిన 'ఫ్రోయీన్' రోబో వరుడు కాగా, వధువు 'టకయుకి టోడో' కంపెనీ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో 'యుకిరిన్'. రెండు కంపెనీల ప్రతినిధుల సమక్షంలో అచ్చం పెళ్లి కుమార్తెగా తెల్లని గౌనులో వచ్చిన 'యుకిరిన్'ను 'ఫ్రోయీన్' వివాహమాడగా, వీరికి వివాహం జరిపించింది 'పెప్పర్' అనే రోబో. వివాహానంతరం కేక్ కట్ చేసిన అతిథులను రోబో బ్యాచ్ వీనులవిందైన ఆర్కెస్ట్రాతో అలరించింది.

More Telugu News