Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలి: జేపీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రల మధ్య రాజకీయ వివాదం రేపిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. ఈ అంశాలను అడ్డుపెట్టుకుని ప్రజల జీవితాలతో నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత 13 నెలల్లో హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కానీ ఎంత చిచ్చు పెడితే అంత రాజకీయ లబ్ధి వస్తుందని నేతలు అనుకుంటున్నారని జేపీ విమర్శించారు. అందుకే ప్రతిరోజూ దుమారం రేపుతున్నారని మండిపడ్డారు. ఇదంతా వారి పార్టీలకు లబ్ధి చేకూర్చుకునేందుకేనని ప్రజలు గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జేపీ మాట్లాడారు. చిన్న చిన్న విభేదాలు ముదిరిన సందర్భాలు చాలా ఉన్నాయని, రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తరువాత ఇప్పుడు విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నికల లబ్ధి కోసం హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారని ధ్వజమెత్తారు.

More Telugu News