Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైలో మెట్రో సర్వీసులు ప్రారంభించిన జయలలిత

తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు పరుగులు తీసింది. ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మెట్రో రైలును ప్రారంభించారు. తొలి దశలో కోయంబేడు నుంచి అలాండర్ మధ్య 10 కిలోమీటర్ల దూరానికి మెట్రో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం నుంచే జెండా ఊపి కోయంబేడు, ఆరుంబాక్కం, వడపళని, అశోక్ నగర్, ఈక్కాడతాంగల్, ఆలందూరు మెట్రో స్టేషన్లను జయ ప్రారంభించారు. మొదటిరోజు పట్టాలెక్కే రైళ్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపించాలన్న ఆలోచనతో రూ.28 లక్షలతో కొనుగోలు చేసిన పుష్పాలతో అలంకరించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, జైపూర్ లలో మెట్రో సర్వీసులు ఉన్నాయి.

More Telugu News