రేపట్నుంచి జులై 8 వరకు హైదరాబాదులో బస చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపట్నుంచి జులై 8 వరకు హైదరాబాదులో బస చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాద్ వస్తున్నారు. జులై 8 వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. తన పర్యటనలో భాగంగా, జులై 1న ఆయన తిరుపతి వెళతారు. జులై 3న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అలాగే జులై 6న రాష్ట్రపతి నిలయంలో 'నక్షత్ర వాటిక'ను ప్రారంభిస్తారు.

More Telugu News