Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతి, ప్రధానితోనూ గవర్నర్ భేటీ?... క్షణక్షణానికీ పెరుగుతున్న ఉత్కంఠ!

కేంద్ర హోం శాఖ పిలుపుతో నిన్న సాయంత్రం ఉన్నపళంగా హస్తిన పర్యటనకు వెళ్లిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేటి ఉదయం 11 గంటలకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన హోం శాఖ ఉన్నతాధికారులతోనూ భేటీ అవుతారు. ఈ రెండు భేటీల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయన్న అంశంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ గవర్నర్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వారిద్దరి అపాయింట్ మెంట్ కోరుతూ గవర్నర్ లేఖలు రాశారట. రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్ భేటీపై వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామాలు తప్పవన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది.

More Telugu News