ఆలోచనల్లో స్పష్టత లేకే తొలి రెండు వన్డేలలో ఓడిపోయాం: కోహ్లీ వ్యాఖ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలోచనల్లో స్పష్టత లేకే తొలి రెండు వన్డేలలో ఓడిపోయాం: కోహ్లీ వ్యాఖ్య

బంగ్లా టూర్ లో టీమిండియా పరాజయాలపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణాలను కనుగొన్నాడు. నిన్నటి వన్డే మ్యాచ్ కు ముందు ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు అటు జట్టులోనే కాక ఇటు క్రీడాభిమానుల్లోనూ అలజడి రేపాయి. ‘‘మా ఆలోచనల్లో స్పష్టత లేని కారణంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయాం’’ అని అతడు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘‘నిర్ణయాలు తీసుకునే సమయంలోనే ఎంతో ఊగిసలాట నెలకొంది. అదే మైదానంలోనూ కనిపించింది. ఇది చెప్పదగిన విషయం కాదు. ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారనే విషయాన్ని వీక్షకులు, విశ్లేషకులు గమనించగలరు’’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

More Telugu News