బీజేపీలో ఆ నేతలందరినీ బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు: యశ్వంత్ సిన్హా
బీజేపీలో డెబ్బై ఐదు ఏళ్లు దాటిన నేతలందరినీ మంత్రులుగా తీసుకోకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టిన నిబంధనపై ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మండిపడుతున్నారు. "బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారందరినీ మే 26, 2014న (ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటైన రోజు) బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు" అని వ్యాఖ్యానించారు. అలా బ్రెయిన్ డెడ్ అయిన వారిలో తాను కూడా ఉన్నానని యశ్వంత్ చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో ఆర్థిక, విదేశాంగ వ్యవహారాల శాఖలను యశ్వంత్ నిర్వహించారు. కానీ ప్రస్తుతం బీజేపీ అగ్రనేతలను నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రస్తుత ఎన్ డీఏ ప్రభుత్వంలో యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.