యోగాను రాజకీయాలకు దూరంగా ఉంచండి: శిల్పా శెట్టి
యోగాను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని రాజకీయ నాయకులకు ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సూచించింది. ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో భర్త రాజ్ కుంద్రాతో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ నాయకుల కారణంగానే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారనడాన్ని ఖండించింది. యోగా ద్వారా జీవితాన్ని మార్చుకోవాలని భావించేవారు దానిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆమె సూచించింది. తాను ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తానని శిల్పా శెట్టి తెలిపింది. అందుకు సాక్ష్యం తన భర్త క్రెడిట్ కార్డు బిల్లేనని చెప్పింది.