మే 21న బంజారాహిల్స్ హోటల్లో జగన్ ఎవరిని కలిశారో బయటపెడతాం: టీడీపీ నాయకురాలు అనురాధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మే 21న బంజారాహిల్స్ హోటల్లో జగన్ ఎవరిని కలిశారో బయటపెడతాం: టీడీపీ నాయకురాలు అనురాధ

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్రంగా మండిపడ్డారు. సెక్షన్ 8పై జగన్ ఎందుకు మాట్లాడరని ఆమె ప్రశ్నించారు. మే 21న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని 'సితార' హోటల్ లో జగన్ ఎవరిని కలిశారు? ఎవరెవరితో కుమ్మక్కు రాజకీయాలు నడిపారో త్వరలోనే బయట పెడతామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనురాధ మాట్లాడారు. వైసీపికి జగన్ అధ్యక్షుడైతే... కేసీఆర్ షాడో అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 8 అమలుకాకుంటే తానే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.

More Telugu News