Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెదడుకు ఆపరేషన్ జరుగుతుంటే, పాటలు పాడుతూ, డాక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించిన యువతి

అత్యంత క్లిష్టమైన మెదడు ఆపరేషన్ జరుగుతుంటే, ఆ యువతి డాక్టర్లనే విస్తుపోయేలా చేసింది. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి బెంగళూరులోని సీతా బతేజా ఆసుపత్రిలో మెదడులోని కణితిని తొలగించే శస్త్రచికిత్స జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు డాక్టర్లు ఈ ఆపరేషన్ చేయగా, ఆమె మెదడులోని సమాచార వ్యవస్థ పనిచేస్తూనే ఉంది. ఆపరేషన్ జరుగుతుంటే, తనకిష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలను ఆ యువతి పాడిందట. వారాల పేర్లు చెప్పండి? ఆ బొమ్మలో ఏం కనిపిస్తోంది? ఒకటి నుంచి వంద వరకూ, వంద నుంచి ఒకటి వరకూ అంకెలు చెప్పండి? అంటూ ప్రశ్నలు సంధించిందట. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్ సమయంలో ఆమె మత్తులో లేదని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ అరవింద్ తెలిపారు. మెదడులోని కణితి మాట్లాడే శక్తినిచ్చే భాగానికి అతిదగ్గరగా ఉండడంతో, ఆపరేషన్ తరువాత ఆమె తన మాట్లాడే శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆపరేషనుకు ముందు కౌన్సెలింగ్ తీసుకుందని వివరించారు.

More Telugu News