Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పన్నెండేళ్ల బాలిక జరిపిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి

నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని వజిర్ నగరంలో, ఓ మార్కెట్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల బాలికని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వారానికి ఒక రోజు జరిగే సంతలో భాగంగా, ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వివరించారు. కాగా, సోమవారం నాడు బోర్నో రాజధానిలో 17 ఏళ్ల బాలిక బస్టాండ్ లో ఆత్మాహుతి దాడి జరుపగా, 20 మంది మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News