తెలంగాణ పోలీసులు వివరాలు తీసుకున్నారు...ట్యాపింగ్ ను నిర్ధారించిన సర్వీస్ ప్రొవైడర్లు
తెలంగాణ నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారుల కాల్ డేటాలు తీసుకున్నాయని సర్వీస్ ప్రొవైడర్లు ఆంధ్రప్రదేశ్ సిట్ విచారణలో తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్ విచారణ ముగిసింది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో రెండు రోజులపాటు జరిగిన విచారణలో టెలిఫోన్ నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు పలు విషయాలు వెల్లడించారు. ఆయా సర్వీస్ ప్రొవైడర్ల సంస్థల ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఏపీ పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. విచారణ నివేదికను సిట్, ఏపీ డీజీపీకి అందజేయనుంది.