ఏపీ మంత్రుల వద్ద కాదు... అత్తారింట్లో ఉంటున్నా: మత్తయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ మంత్రుల వద్ద కాదు... అత్తారింట్లో ఉంటున్నా: మత్తయ్య

తాను ఏపీ మంత్రుల సంరక్షణలో ఉన్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని 'ఓటుకు నోటు' కేసులో నాలుగవ ముద్దాయి జెరూసలెం మత్తయ్య స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయని మత్తయ్య ఈ మధ్యాహ్నం మీడియాకు తెలిపారు. తన భార్య స్వస్థలం గుంటూరులోని అత్తగారింట్లో ఉంటున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకనే తాను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నట్టు తెలిపారు. మంత్రులు తనకు రక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించినట్టు జరుగుతున్న ప్రచారం కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదేనని ఆరోపించారు.

More Telugu News