సిస్టర్ నిర్మల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిస్టర్ నిర్మల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్

మదర్ థెరిస్సా వారసురాలిగా 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిస్వార్థంగా పేదల కోసం, అనాథల కోసం సేవలందించిన సిస్టర్ నిర్మలను కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ ఉదయం సిస్టర్ నిర్మల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1997 నుంచి 2009 వరకు ఆమె మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను నిర్వహించారు. 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

More Telugu News