బ్రెయిలీ లిపిలో యోగా పుస్తకం... ఆవిష్కరించిన రాష్ట్రపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రెయిలీ లిపిలో యోగా పుస్తకం... ఆవిష్కరించిన రాష్ట్రపతి

'యోగి కా స్పర్శ్' పేరుతో బ్రెయిలీ లిపిలో ప్రచురించిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ మురళీ మనోహర్ జోషి కుమార్తె, యోగా టీచరైన నివేదితా జోషి ఈ పుస్తకాన్ని రాశారు. రాష్ట్రపతి భవన్ లో ఈరోజు జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జోషీ దంపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ, మనిషి శారీరక, మానసిక, నైతిక వికాసానికి యోగా చక్కటి పరిష్కారమని పేర్కొన్నారు. యోగా గొప్పతనాన్ని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోందని చెప్పారు. అంధులకు కూడా యోగాను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా జోషి కుమార్తె నివేదిత తెలిపారు.

More Telugu News