మలేసియాలో భూకంపం... సునామీ ప్రమాదం లేదన్న ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మలేసియాలో భూకంపం... సునామీ ప్రమాదం లేదన్న ప్రభుత్వం

ఆగ్నేయాసియాలో సంపన్న దేశంగా పేరుగాంచిన మలేసియాలో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తేలింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియరాలేదు. అయితే ఈ కారణంగా సునామీ ప్రమాదమేమీ లేదని మలేసియా ప్రభుత్వం వెల్లడించింది.

More Telugu News