మోదీని చంపేస్తామని బెదిరింపులు... యూపీలో యువకుడి అరెస్ట్
మోదీని చంపేస్తామని వాట్స్ యాప్ లో మెసేజ్ లు పంపుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నవిల్ గ్రామానికి చెందిన రామ్ వీర్ పోలీసులకు, మీడియాకు ఈ మెసేజ్ ని పంపాడని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని స్పెషల్ ఎస్పీ రాకేష్ సింగ్ తెలిపారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయాలన్నది రామ్ వీర్ ఉద్దేశమని ఆయన వివరించారు. ఓ తప్పుడు పేరు, చిరునామాతో సిమ్ కార్డు సంపాదించిన రామ్ వీర్ గతంలోనూ ఇదే తరహా మెసేజ్ లు పంపాడని తెలిపారు. రేపు మధురలో మోదీ పర్యటన జరగనున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.