వాహన బీమా రెన్యువల్ లో మనవాళ్ల ఉదాసీనత!
ఏ వాహనానికైనా ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరి. అయితే మన దేశంలో చాలామంది వాహనదారులు వాహనం కొన్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ చేసి, దానిని రెన్యువల్ చేయించుకోవడం లేదని రహదారి భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, కోర్టుకు తెలిపింది. దేశంలో 82 శాతం ప్రైవేట్ వాహనాలు ఉండగా, వాటిలో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలకు బీమా సౌకర్యం లేదని ఈ కమిటీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత బీమా చేయించుకోకపోతే అది చట్టరీత్యా నేరమని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మన వాహనం కారణంగా ప్రమాదం జరిగితే, గాయపడిన వారికి బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుందని వారు వివరించారు.