చంద్రబాబుపై అసంతృప్తి వెళ్లగక్కిన కేఈ... కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుపై అసంతృప్తి వెళ్లగక్కిన కేఈ... కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణ

సీఎం చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. బాబు చూపంతా ఎప్పుడూ పశ్చిమగోదావరి జిల్లాపైనేనని, కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అలాగని కర్నూలులో 3 సీట్లే గెలవడంలో తమ తప్పు లేదన్నారు. కొత్తగా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వ్యక్తి చాలా శ్రమపడాలని సూచించారు. జిల్లాలో ఏ వీధి ఎక్కడుందో కొత్త అధ్యక్షుడికి తెలీదని ఎద్దేవా చేశారు. అయితే జిల్లా అధ్యక్షుడి మార్పు సాహసోపేతమైన నిర్ణయమని కేఈ అన్నారు.

More Telugu News