ఆయనకు లేఖ రాస్తే మోదీకి చేరింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయనకు లేఖ రాస్తే మోదీకి చేరింది!

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజీత్ అనే యువకుడు తన ఆర్థిక నిస్సహాయతను వివరిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశాడు. తనకు ఉద్యోగం లేదని, చెల్లెళ్ల వివాహం చేయలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఓ ఉద్యోగం ఇస్తే, తన పరిస్థితిలో మార్పు వస్తుందని విన్నవించుకున్నాడు. అయితే, మన్మోహన్ కు రాసిన ఆ లేఖ పట్ల తాజా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రభుత్వాలు మారిన సమయంలో లేఖను ఎవరూ పట్టించుకోలేదు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక జనవరిలో దానిని గుర్తించారు. అయితే, ఆయన కేవలం 50 వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. ఆ సాయం ఏమూలకు వస్తుందని మంజీత్ కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో పెళ్లి చేయాలంటే లక్షలు వెచ్చించడం తప్పనిసరి అని, ఈ రూ.50 వేలతో ఏం చేయగలమని వారు వాపోయారు.

More Telugu News