అజాంఖాన్ అడ్డుపుల్ల... జయప్రదకు ఎమ్మెల్సీ పదవి చేజారింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అజాంఖాన్ అడ్డుపుల్ల... జయప్రదకు ఎమ్మెల్సీ పదవి చేజారింది

ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ నేత అజాంఖాన్ అనుకున్నది సాధించారు. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎమ్మెల్సీ పదవి రాకుండా చేశారు. దాంతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తనకు రాజకీయ జన్మనిచ్చిన సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు జయ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ సుముఖంగా ఉన్నారు. గవర్నర్ కోటా కింద విధాన్ పరిషత్ కు 9 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు. అందులో ఆమె పేరు కూడా ఉంచారు. అయితే, జయంటే గిట్టని అజాంఖాన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి పార్టీలోకి జయను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి వీల్లేదని మొండి పట్టుబట్టారు. దాంతో చేసేదిలేక ఆమె పేరును పార్టీ పక్కన బెట్టాల్సి వచ్చింది. ఇలాగే 2009 లోక్ సభ ఎన్నికల్లో కూడా జయప్రద అభ్యర్థిత్వాన్ని అజాం వ్యతిరేకించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది.

More Telugu News