కుంభకోణాల భయంతోనే దస్త్రాలపై సంతకాలు పెట్టట్లేదు: రక్షణ మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుంభకోణాల భయంతోనే దస్త్రాలపై సంతకాలు పెట్టట్లేదు: రక్షణ మంత్రి

నరేంద్ర మోదీ ప్రభుత్వం 365 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు కీలక నిర్ణయాల విషయంలో దస్త్రాలపై సంతకాలు పెట్టక పోవడానికి కుంభకోణాల భయమే కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు జరిపిన కుంభకోణాలు తిరిగి ఎక్కడ పునరావృతమవుతాయో అన్న భయాందోళనలు నిర్ణయాల ఆలస్యానికి దారితీస్తున్నాయని అన్నారు. "ఏ ఫైలూ కదలలేని స్థితిలో ఉంది. ప్రతి నిర్ణయం వెనుక ప్రతిఫలాలు అందుకోవడం లేదా కుంభకోణం ఉంటుందన్న అభిప్రాయంలో ప్రజలున్నారు. నేను రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 200కు పైగా సిఫార్సు నోట్లు వివిధ లాబీల నుంచి అందుకున్నా" అని ఆయన వివరించారు. పచ్చజెండా ఊపేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News