Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమీర్ ఖాన్ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్ కు వచ్చిన మల్లికా షెరావత్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స్టైలే వేరు. ఆయన ఏది చేసినా సంచలనమే. సాధారణంగా సినిమాల్లో పాత్రలకు నటీనటులను దర్శక, నిర్మాతలు ముందుగానే నిర్ణయిస్తారు. అనంతరం హీరోను సంప్రదించి, అతని సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తారు. అలాంటప్పుడు ఆయా పాత్రలకు ఎవరిని అనుకుంటారో వారిని తీసుకుంటారు. కొత్తవారిని అనుకుంటే వారికి ఆడిషన్ నిర్వహిస్తారు. కానీ అమీర్ ఖాన్ బాలీవుడ్ సెక్సీస్టార్ మల్లికా షెరావత్ కు ఆడిషన్ నిర్వహించడం విశేషం. అమీర్ ఖాన్ తదుపరి సినిమా 'దంగల్' లో అతని భార్య పాత్రకు నిర్వహించిన ఆడిషన్స్ లో మల్లికా షెరావత్ పాల్గొంది. రెజ్లర్ మహవీర్ సింగ్ జీవితం ఆధారంగా 'దంగల్' రూపొందించనున్నారు. సెప్టెంబర్ నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని అమీర్ ఖాన్ తెలిపారు.

More Telugu News