జనతా పరివార్ అలయెన్స్ లోకి బీహార్ మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనతా పరివార్ అలయెన్స్ లోకి బీహార్ మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, నితీశ్ కుమార్ కు ఒకప్పుడు రాజకీయ సన్నిహితుడైన జితన్ రామ్ మాంఝీని జనతా పరివార్ లో చేరాలంటూ పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆర్టేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. "బీజేపీకి వ్యతిరేకంగా మేమంతా పార్టీల వేదికగా ఐక్యమవుతున్నాం. ఇందులో మాంఝీ, ఇతరులు కూడా మాతో కలసి రావొచ్చు" అని లాలూ పేర్కొన్నారు. వచ్చే ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని జనతా పరివార్ లోని నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కావల్సిన బలాన్ని కూడగట్టుకునే యత్నం పరివార్ చేస్తుందని, అందులో భాగంగానే మాంఝీని ఇలా ఆహ్వానించారని పలువురు అంటున్నారు. మరీ పిలుపుకు మాంఝీ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

More Telugu News