'కూల్చేస్తాం' అనే లోపు విమానంలోంచి దూకేసిన పైలట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కూల్చేస్తాం' అనే లోపు విమానంలోంచి దూకేసిన పైలట్!

అమెరికాలోని ఉత్తర ప్రాంతాల నుంచి మధ్య అమెరికాకు మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు అమెరికా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వెనెజులా నుంచి మత్తుపదార్థాల రవాణాను నియంత్రించేందుకు అన్ని మార్గాలను కట్టుదిట్టం చేసింది. దీంతో తమ గగనతలంపై వచ్చే చిన్న విమానాలపై కొలంబియా వైమానిక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది. వెనెజులాకు చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం టన్నుకు పైగా కొకైన్ తో బయల్దేరింది. దీనిని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆ పైలట్ అందులో నుంచి దూకేశాడు. డ్రైవింగ్ చేయకపోవడంతో మోటార్లు విఫలమైన ఆ విమానం కొలంబియా తీరంలో కుప్పకూలిపోయింది. విమానంలోంచి దూకేసిన పైలట్ ప్రాణాలు కోల్పోగా, అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది. పైలట్ ఏ దేశానికి చెందిన వాడనే దానిని ఇంకా వెల్లడించలేదు.

More Telugu News