Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లిని ప్రేమిస్తున్నాను అంటే... భార్యను ప్రేమించట్లేదనా?: రైల్వే మంత్రి సురేష్ ప్రభు

ఇండియాలో బులెట్ రైళ్లు, భూసేకరణ సమస్యల గురించి ప్రస్తావిస్తూ, రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు తల్లి, భార్యల మధ్య సారూప్యతను తనదైన శైలిలో ప్రస్తావించారు. "నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను అంటే భార్యను ప్రేమించట్లేదనా? నేను రెండూ చేయగలను" అని అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. భూసమీకరణపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లిందని, భూసేకరణ సమస్యగా మారితే బులెట్ రైళ్ల కల నెరవేరదని ఆయన అన్నారు. కానీ, ఈ రెండు పనులనూ తమ ప్రభుత్వం చేసి చూపుతుందని వివరించారు. బులెట్ రైళ్ల ప్రాజెక్టులు చేపట్టడంలో ఎన్డీఏ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాము పరుగు ప్రారంభిద్దామని షూస్ వేసుకునేందుకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని, దేశం ఎలా వుండాలో వారు సూచించడం ఏంటని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

More Telugu News