Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కిక్' మీద కిక్ ఇస్తున్న మిషెల్ ఒబామా!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి, యూఎస్ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా కిక్ బాక్సింగ్ లో ఇరగదీస్తున్నారు. ఒక్కోటి 15 కేజీల బరువున్న డంబెల్స్ తో కసరత్తులు చేస్తున్నారు. ఆమేదైనా బాక్సింగ్ పోటీకి సిద్ధమవుతున్నదేమో అనుకుంటున్నారా? అదేం లేదండీ, స్వతహాగా అథ్లెటిక్ బాడీని కలిగివుండే మిషెల్ 'లెట్స్ మూవ్' అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకర జీవనానికి వ్యాయామం ముఖ్యమని చెబుతూ, తన 2 నిమిషాల వర్కవుట్ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడా వీడియో అందరినీ ఆకర్షిస్తూ, సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా విస్తరిస్తోంది.

More Telugu News