ప్రభాస్ పై మోహన్ బాబు అలక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ పై మోహన్ బాబు అలక!

ఈ ఉదయం మోహన్ బాబు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై అలిగారు. మనోజ్ పెళ్లికి చాలా ఆలస్యంగా, అది కూడా ఒంటరిగా వచ్చిన ప్రభాస్ ను చూసి మోహన్ బాబు ఒకింత కోపాన్ని ప్రదర్శించారు. దీంతో మోహన్ బాబును గట్టిగా హత్తుకుని, తన ఆలస్యానికి కారణాలు చెప్పి, గడ్డం పట్టుకుని బతిమాలి మరీ ప్రభాస్ మండపం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. మండపం దగ్గర ప్రభాస్ కు ఎదురొచ్చిన విష్ణు ఎందుకాలస్యం అయిందని ప్రశ్నిస్తూ, సరదాగా భుజంపై ఒకటిచ్చాడు. ఆపై అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ, నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు. తన కాళ్లకు మొక్కవద్దని ప్రభాస్ వారించగా, మోహన్ బాబు ఒప్పుకోలేదు. మనోజ్ దంపతులను ప్రభాస్ కాళ్లకు మొక్కించి, ఆశీర్వాదం ఇప్పించారు.

More Telugu News