Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ గోల మాకేల?... బదిలీ చెయ్యండి మహాప్రభో!: ఐఏఎస్ ల వేడుకోలు

ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఐఏఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. గత కొద్ది రోజులుగా అధికారుల మార్పు చేర్పులు, గవర్నర్ చెబితే కేజ్రీవాల్ కాదంటుండడం, కేజ్రీ నియమిస్తే గవర్నర్ చెల్లదనడం, కార్యాలయాలకు తాళాలు ఇత్యాది ఘటనలతో విసిగి పోయిన అధికారులు ఇక తమ వల్ల కాదు, బదిలీ చెయ్యండో అని మొరపెట్టుకుంటున్నారు. వీరి యుద్ధంలో తాము బలిపశువులము కాలేమంటూ 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమను తప్పించి మరోచోటకు పంపాలని హోం శాఖను కోరారని తెలుస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తమను పీడిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ వివాదాలకు పరిష్కారం కనుక్కుంటామని, కాస్తంత ఓపిక పట్టాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

More Telugu News