Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంచు మనోజ్ దంపతులకు గవర్నర్ నరసింహన్, నటుడు మహేష్ దంపతుల ఆశీర్వాదం

మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలను ఆశీర్వదించేందుకు హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణానికి అతిరథమహారధులు తరలివస్తున్నారు. కొద్దిసేపటికిందట గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి మనోజ్ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి ఆశీర్వదించారు. ఆ వెంటనే హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మ్యాట్రిక్స్ ప్రసాద్, హీరో సూర్య, నటుడు అలీ, తదితరులు మనోజ్, ప్రణతిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.

More Telugu News