Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మంచు’ వారింట పెళ్లి సందడి...మరికాసేపట్లో మనోజ్ వివాహం, హాజరుకానున్న ప్రముఖులు

ప్రముఖ టాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు ఇంట కాసేపట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిని పరిణయమాడనున్నాడు. ఈ మేరకు మాదాపూర్ లోని హైటెక్స్ లో భారీగా ఏర్పాట్లు జరిగాయి. నేటి ఉదయం 9.10 గంటలకు జరగనున్న ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ ల నుంచే కాక బాలీవుడ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక మోహన్ బాబుకు రాజకీయ నేపథ్యమూ ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, పలువురు గవర్నర్లు ఈ శుభకార్యానికి విచ్చేసి మనోజ్, ప్రణతిలను ఆశీర్వదించనున్నట్లు తెలుస్తోంది. నేటి తెల్లవారుజాము నుంచే హైటెక్స్ లో మంచు వారి పెళ్లి సందడి మొదలైంది.

More Telugu News