పాకిస్థాన్ లోనే దావూద్... గుర్తించిన భారత నిఘా సంస్థలు
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ముర్రీ రోడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దావూద్ ఉంటున్నాడని తెలుసుకున్నాయి. అతడికి ఐఎస్ఐ ఆతిథ్యమిస్తున్నట్టు సమాచారం. ముర్రీ రోడ్ ఇస్లామాబాద్, రావల్పిండిల మీదుగా ముర్రీ వరకు సాగిపోతుంది. కాగా, దావూద్, అతడి కుటుంబం వద్ద పాకిస్థాన్ పాస్ పోర్టులు ఉన్నాయి. దావూద్ పాకిస్థాన్ జారీ చేసిన మూడు పాస్ పోర్టులు కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి.