ఏంటీ గోల?... ఢిల్లీ గవర్నర్ ను పిలిపించుకున్న రాష్ట్రపతి ప్రణబ్
ఈ మధ్యాహ్నం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రణబ్ ముఖర్జీ గవర్నరును హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. ప్రణబ్ ను కలిసిన నజీబ్ జంగ్, అధికారుల పోస్టింగుల విషయమై రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను గురించి వివరించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని, గవర్నర్ అధికారాలను గౌరవించడం లేదని ఆరోపించినట్టు సమాచారం. వివాదాస్పదం అవుతూ, ప్రజల మధ్య చులకన కావద్దని, త్వరలోనే ఇరువురి మధ్యా సమావేశం ఏర్పాటు చేయిస్తానని ప్రణబ్ అన్నట్టు తెలిసింది.