Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో వివాదాస్పదం అవుతున్న టెన్త్ రిజల్ట్స్... హైదరాబాద్ లో డీఈవో కార్యాలయం ధ్వంసం

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. కావాలనే మార్కులు తక్కువగా వేసి పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో, వీరి ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన తమ పిల్లలు ఫిజిక్స్, మ్యాథ్స్ లో మాత్రం ఎందుకు ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News